BB8 : రెండు వారాలకే భారీ రెమ్యునరేషన్ అందుకున్న శేఖర్‌ బాషా?

Suma Kallamadi
బుల్లితెర బడా షో బిగ్ బాస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ షో అంటే జనాలలో చెప్పలేని క్రేజ్. కాగా ఎనిమిదో సీజన్ రెండో వారం విజయ వంతంగా గడిచి పోయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగు పెడితే ఇద్దరు ఇప్పటికే ఎలిమినేటి అయిపోయారు. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ ఊహించినదే అయినప్పటికీ రెండో వారం మాత్రం షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చాలా వారాలు హౌస్ లో ఉంటాడనుకున్న ఆర్జే శేఖర్ బాషా ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అటు కంటెస్టెంట్స్ తో పాటుగా ఇటు ప్రేక్షకులకు కూడా షాక్ అనిపించింది. బిగ్‌బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ శేఖర్ బాషా పాలిట శాపంగా మారిందని చెప్పుకోవాలి.
ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఆఖరి 2 స్థానాల్లో ఆదిత్య ఓం, శేఖర్ బాషా నిలవగా... బిగ్ బాస్ హౌసులో ఎవరు ఉండాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? అనే విషయం ఈసారి ఆడియెన్స్ కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ నిర్ణయిస్తారంటూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇవ్వగా కిర్రాక్ సీత తప్పితే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కట్ట కట్టుకుని మరీ శేఖర్ బాషా హౌస్ నుంచి బయటకి తోసేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి తన కామెడీ పంచులు, ప్రాసలతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోన్ శేకర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఆడియెన్స్‌ను షాక్ కు గురి చేసిందని చెప్పుకోవాలి. కాగా హౌస్ లో ఉన్నది రెండు వారాలే అయినప్పటికీ శేఖర్ బాషాకు భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
ఎనిమిదో సీజన్ కోసం శేఖర్ బాషా రోజుకు రూ. 35 వేల చొప్పున వారానికి రూ. 2.50 లక్షలు పారి తోషకం అందుకున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అలా 2 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బాషా మొత్తంగా రూ. 5 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా మరోసారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా ఊహాగానాలు ఉన్నాయి. మరో 3 వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనుండగా... అప్పుడు మళ్లీ హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏమో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: