' దేవ‌ర ' ను కావాల‌ని టార్గెట్ చేస్తోన్న ఆ తెలుగు మీడియా... ఇంట‌ర్వూ ఇవ్వ‌లేద‌నా.. డ‌బ్బులివ్వ‌లేద‌నా..?

RAMAKRISHNA S.S.
ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను తెలుగులో ఓ ప్రముఖ మీడియా గట్టిగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ మీడియా సంస్థకు చెందిన పత్రికతో పాటు.. ఛానల్ లోనూ, వెబ్సైట్‌లోనూ దేవరకు వ్యతిరేకంగా కంటిన్యూగా వార్తలు వేస్తున్నారు. గత వారం రోజుల నుంచి దేవరను టార్గెట్ చేస్తూ ఆర్టికల్స్ బయటకు వదులుతున్నారు. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో జై ఎన్టీఆర్ అని నినాదాలు ఇచ్చేందుకు డబ్బులు ఇచ్చి మరి అక్కడ కొంతమందిని సెట్ చేసుకున్నారంటూ.. ఆ మీడియా సంస్థకు చెందిన వెబ్సైట్ ప్రముఖంగా కథనం ప్రచురించింది. అలాగే దేవర సినిమా ట్రైలర్ మీద కూడా ఆ మీడియా సంస్థకు చెందిన వెబ్సైట్ విషం చిమ్మింది.

ట్రైలర్ ఏ మాత్రం అంచనాలు అందుకోలేదని.. ట్రైలర్లో కొత్తదనం లేదంటూ కథనాలు ప్రచురించింది. తాజాగా దేవర సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ సినిమా ప్రమోషన్లు కూడా సరిగా జరగటం లేదని.. సినిమాకు అనుకున్నంత హైప్ లేదని.. విష ప్రచారం మొదలుపెట్టేసింది. ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ నార్త్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ నార్త్‌లో ఎక్కువగా ప్రచారం చేస్తూ తెలుగు మీడియాను, తెలుగు ప్రమోషన్లను సరిగా పట్టించుకోవడంలేదని వరుసగా కథనాలు ప్రచారం చేస్తోంది.

పైగా కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్‌ను కమెడియన్‌లా చూపించారని ప్రచురించడంతోపాటు.. తెలుగులో కుర్ర హీరోలు జొన్నలగడ్డ, సిద్దు విశ్వక్సేన్ తో.. ఎన్టీఆర్, కొరటాల ఇంటర్వ్యూ రికార్డు చేయించడం కూడా ఎన్టీఆర్ ఇమేజ్, ఎన్టీఆర్ క్రేజ్ ను తగ్గించేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఏది ఏమైనా గత 20 రోజులుగా దేవర సినిమాను టార్గెట్గా చేసుకొని సదరు తెలుగు మీడియా.. ప్రముఖ పత్రిక, వెబ్సైట్ భారీగా నెగిటివ్ స్టోరీలు అయితే చేస్తున్నారు. అయితే వీళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం.. లేదా యాడ్స్ ఇవ్వలేదని కోపంతో ఇలా చేస్తున్నారా.. అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: