దశాబ్దాల పాటు వెండితెరపై అలరించిన ఓ గొప్ప స్టార్, తన మార్గాన్ని మార్చుకొని ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. తను నటించే చివరి సినిమాపై ఇన్నాళ్లూ ఆరాధించిన అభిమానుల్లో ఎంతటి హైప్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట త్వరలో అలాంటి సినిమానే రానుంది. వివరాల్లోకెళ్తే.. తమిళ అగ్రనటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట సొంత రాజకీయపార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్
దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. KVN ప్రొడక్షన్స్ లో విజయ్ నటించబోయే ఈ సినిమాకు గాను కెరీర్ హయ్యెస్ట్ పారితోషకం అందుకోనున్నాడట KVN ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా కోసం విజయ్ కు అక్షరాలా 275 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వనుందట. ఈ స్థాయి రెమ్యునరేషన్ ను ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా తీసుకోలేదు. మరోవైపు హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అవెంజర్స్ లో
ఐరన్ మ్యాన్ గా నటించిన రాబర్ట్ డౌనీ ఎండ్ గేమ్ సినిమాకు రూ. 160 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు 69 వ సినిమాకు విజయ్ హాలీవుడ్ నటుడిని మించిన రెమ్యునరేషన్ తో రికార్డు సృష్టించాడు. మరోవైపు హిందీ మార్కెట్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి వారి పేర్లు భారీ రెమ్యునరేషన్ అత్యధికంగా తీసుకునేవారి లిస్ట్ లో నిలిస్తే తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాకి ఈజీగా 100 నుంచి 150 కోట్లు తీసుకునే ఏకైక హీరోగా నిలిచాడు...!!