మాస్ మహారాజా రవితేజ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రవితేజ కెరియర్లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో పవర్ మూవీ ఒకటి. ఈ సినిమాలో హన్సిక , రెజీనా కేసాండ్రా హీరోయిన్లుగా నటించగా , బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే బాబి ఈ సినిమాతోనే దర్శకుడిగా తన కెరీర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది.
ఇకపోతే ఈ సినిమా 2014 వ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా భారీ కలక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఈ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీతో 10 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి ... మొత్తంగా ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి నైజాం ఏరియాలో 8.50 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.65 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.20 కోట్లు , ఈస్ట్ లో 1.49 కోట్లు , వెస్ట్ లో 1.26 కోట్లు , గుంటూరులో 1.75 కోట్లు , కృష్ణ లో 1.15 కోట్లు , నెల్లూరు లో 80 లక్షలు. మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 20.8 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.96 కోట్లు , ఓవర్సీస్ లో 1.67 కోట్లు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 25.43 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా , టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 25.43 కలెక్షన్లను వసూలు చేసి 2.43 కోట్ల లాభాలను అందుకుంది.