వరద బాధితులకు రూ. 600 సహాయం.. పవన్ రియాక్షన్ ఇదే..!

lakhmi saranya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ ముంపు బారిన పడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక అదే సమయంలో వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టానికి సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమవంతుగా ముఖ్య మంత్రి సహాయ నిధికి సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజువారి కూలీ పని చేసుకునే ఓ వ్యక్తి ముఖ్యమంత్రి సహాయ నిధికి 600 రూపాయలను విరాళంగా ఇచ్చారు.
ఈ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ ర.600 విజయవాడ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది ఆ డబ్బులు కూడా పంపిస్తాను. నాకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. కష్టాలన్నవి అందరికీ వస్తుంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది" అంటూ గొడవర్తి సుబ్రహ్మణ్యం X వేదికగా పేర్కొన్నారు. అయితే దీనిపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంవో పవన్ కళ్యాణ్ స్పందించారు. అతన్ని అభినందిస్తూ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
 "రోజు వారి కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ. నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి సుబ్రహ్మణ్యం గారు అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. సహాయం చిన్నదా పెద్దదా అన్నది కాదు సహాయం చేసే మనసు ఉండటం ముఖ్యం అన్నది ఈ పోస్ట్ ద్వారా అందరికీ అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: