తాజాగా లావణ్య కి పోలీసులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. లావణ్య చెప్పిన విషయాలన్నీ నిజమేనని,రాజ్ తరుణ్ నిజంగానే లావణ్యతో 11 సంవత్సరాలు సహజీవనం చేశారని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ చెప్పి రాజ్ తరుణ్ ని ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. దీంతో ఒక్కసారిగా లావణ్య కు రెక్కలొచ్చినట్టు అయిపోయాయి.మీడియా ముందుకు వచ్చి సత్యమే గెలుస్తుంది అంటూ ఎన్నో భారీ భారీ డైలాగులు చెప్పింది. దీంతో మళ్లీ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు రాజ్ తరుణ్, లావణ్యలు.. అయితే ఎప్పుడైతే పోలీసులు లావణ్య చెప్పింది నిజమేనని చెప్పారో వెంటనే రాజ్ తరుణ్ ని వెతికే పనిలో పడింది లావణ్య. వెంటనే తన తండ్రిని తీసుకొని రాజ్ తరుణ్ ఆచూకీ తెలుసుకొని ముంబైకి చేరుకుంది. ఇక ముంబైలోని ఓ ఫ్లాట్లో మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ సీక్రెట్ గా సహజీవనం చేస్తున్నారు అనే విషయం బయటపడడంతో వెంటనే ఆ ఫ్లాట్ కి చేరుకొని బయటికి రావాలి నా భర్తని నాకు అప్పగించాలి అని ఆ ఫ్లాట్ ముందు గోల గోల చేసింది.
ఇక రాజ్ తరుణ్ నీ తనకి అప్పగించాలని తన భర్త తనకి కావాలి అంటూ మాల్వి మల్హోత్రాపై నిప్పులు చెరిగింది లావణ్య.. దాంతో మరోసారి వీరి విషయం మీడియాలో వైరల్ గా మారింది. ఇక రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఇద్దరూ కలిసి ఒకే ప్లాట్లో లివింగ్ రిలేషన్ లో ఉన్న వీడియోని కూడా లావణ్య బయటపెట్టింది. దీంతో వీరి మేటర్ కాస్త మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యేసరికి మరోసారి రాజ్ తరుణ్ గురించి సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
అంతేకాదు రాజ్ తరుణ్ కి డబ్బు లేని సమయంలో నా తండ్రి సహాయం చేశాడని, ఇప్పటివరకు రాజ్ తరుణ్ కి మేము దాదాపు 70 లక్షల వరకు ఇచ్చేసామని, నా పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు,ఆస్తిపాస్తులు అన్ని రాజ్ తరుణ్ కే నా తండ్రి ఇచ్చాడు అంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. అంతే కాదు సినిమాలు లేని సమయంలో రాజ్ తరుణ్ ని మా ఫ్యామిలీనే పోషించింది అని లావణ్య చెప్పిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాదు డబ్బులు ఇచ్చిన దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని లావణ్య చెప్పింది. మరి ఇప్పటికైనా రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ కట్ చేసుకుని లావణ్య దగ్గరికి వస్తాడా.. లేక లావణ్య తో పూర్తిగా తెగదింపులు చేసుకొని మాల్వి మల్హోత్రాతోనే ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది