చిరంజీవి లేకపోతే మీరంతా ఎక్కడ..?
మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీల మధ్య కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూటమి ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో పెద్ద దుమారమే రేపింది. దీనిపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినా.....నాగబాబు పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసింది.
అయితే ఆ గొడవ సద్దుమణిగినట్లే కనిపించిన తాజాగా మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మరోసారి సంచలనంగా మారుతున్నాయి. అయితే.. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ గురించి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేఖ భోజ్ సంచలన కామెంట్స్ చేసింది. మరి అంతలా ఎగిరి పడకండి సార్. స్వయం ప్రకటిత స్టార్. ఈ రోజు ఉదయం టీవీలో చానల్స్ తిప్పుతూ ఉంటే ఒక దగ్గర పరమానందయ్య శిష్యుల కథ వస్తుంటే చూశానంటూ సెటైర్లు పేల్చింది.
శిష్యులుగా చేసిన పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, సారధి, పూర్ణచంద్రరావు ఇంకా మిగిలిన వారి పేర్లు నాకు తెలియదు. బోద్ధపాటి అని గూగుల్ లో ఉంది. కానీ ఆయన శిష్యుడిగా చేయలేదు అందులో అని మా నానమ్మ చెప్పిందని వెల్లడించింది. పూర్ణచంద్రరావు అనే పేరు కూడా ఆవిడే చెప్పింది. వీళ్లంతా అప్పట్లో ప్రముఖ కమెడియన్స్. ఇంకా వీళ్లే కాకుండా తెలుగులో ఇంకొంతమంది ప్రముఖ కమెడియన్స్ ఉన్నారు. రేలంగి, రమణారెడ్డి, అంజి బాలకృష్ణ, వంగర ఇంకా కొందరి పేర్లు మిస్ అయి ఉంటే నన్ను క్షమించాలి.
ఇలా అల్లు రామలింగయ్య గారితో సమకాలీకులుగా ఉన్న కమెడియన్స్ లో ఆయన కంటే కూడా గొప్ప పేరు ఉన్నవారు ఇందులో కొంతమంది ఉన్నారు. వీరిలో చాలామందికి సినిమా నుంచి కలర్ లోకి వచ్చాక వేషాలు తగ్గిపోయాయి. ఆయన మొహం చూసి ఆయన కుటుంబంలోని స్టార్స్, ఆయనని ప్రాణంగా భావించే ఫ్యాన్స్ కూడా మీకు సపోర్ట్ గా.... ఇంకా గట్టిగా చెప్పాలంటే వీడు మావోడు అని మొదటి సినిమా నుంచే కోట్ల మంది అండగా నిలబడ్డారు అంటూ రేఖ భోజ్ పేర్కొన్నారు. మెగాస్టార్ లేకపోతే మీరంతా ఎక్కడ? అంటూ అర్థం వచ్చేలా..బన్నీని ఉద్దేశించి పరోక్షంగా రేఖ భోజ్ సంచలన కామెంట్స్ చేయడం జరిగింది.