రాజా సాబ్: సైలెంట్ గా వచ్చి.. ఊహించని హిట్టు కొడతాం..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల కల్కి తో ఫ్యాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ హిట్ అందుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు సలార్ సినిమా విపరీతంగా నచ్చేసింది. డార్లింగ్ యాక్షన్ చూసి ప్రేక్షకులు ఆనందంలో తేలిపోయారు. సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్. కల్కి సినిమాతో ఏకంగా సంచలన హిట్‌ను సొంతం చేసుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ

 సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మెంటలెక్కుతోంది ఫ్యాన్స్‌కి.. అయితే మరోవైపు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సిద్ధమవుతోన్న చిత్రం రాజాసాబ్‌. నిధి అగర్వాల్‌, మాళవిక మోహన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రిద్ధి కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, జిషు సేన్‌గుప్తా, బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రలు చేస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2025 ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. ఇందులో భాగంగానే

 రాజాసాబ్‌ చిత్రం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడారు. ‘మేము చాలా సైలెంట్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్‌ కొడతాం. రాజాసాబ్‌ను ప్రారంభించినప్పుడు ప్రభాస్‌ నటించాల్సిన పెద్ద చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా జరుగుతోంది. ఇది చాలా పెద్ద సినిమా. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్‌ వేశాం. ఇండియాలో ఇప్పటివరకు ఇంత భారీ సెట్‌ ఏ సినిమాకు వేయలేదు. సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌లకు కూడా పెద్దపీట వేశాం. సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. ఫైట్స్‌ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్, హారర్‌, యాక్షన్‌ అన్ని ఎలిమెంట్స్‌ రాజాసాబ్‌లో ఉంటాయి’ అని విశ్వప్రసాద్‌ చెప్పారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: