తాజాగా కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఉత్తమ సినిమాలు, నటీనటులు, కొరియోగ్రాఫర్స్ ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించి అవార్డు పొందిన నటీ నటుల పేర్లు,సినిమాల పేర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా మన సౌత్ సినిమాలు హీరో హీరోయిన్లు కూడా అవార్డులు అందుకున్నారు.ఇందులో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ -2 కి అవార్డు వరించింది.అలాగే ఉత్తమ నటుడిగా కాంతారా మూవీకి గాను రిషబ్ శెట్టి కి అవార్డు వచ్చింది. ఉత్తమ కన్నడ సినిమాగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన యష్ హీరోగా చేసిన కేజిఎఫ్ 2 మూవీకి అవార్డు వచ్చింది.
అలాగే ఉత్తమ హిందీ చిత్రం గుల్ మొహర్ అనే మూవీకి అవార్డు లభించింది.ఇక ఉత్తమ నటీమణులుగా తిరుచ్చిత్రాంబలం సినిమాలో నటించిన నిత్యామీనన్ నటనకి కూడా అవార్డు వచ్చింది. ఇక తెలుగు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తిరుచ్చిత్రాంబలం సినిమాలో డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది. ఇలా సౌత్ లో ఉన్న చాలా మంది స్టార్స్ 70వ జాతీయ చలనచిత్ర పురస్కాలలో సత్తా చాటారు.
ఇక తెలుగులో ఉత్తమ చిత్రంగా కార్తికేయ -2 తో పాటు సీతారామం,బలగం వంటి సినిమాలు కూడా పోటీ పడ్డాయి.కానీ ఈ సినిమాలలో కార్తికేయ -2 ని అవార్డు వరించింది.
అలాగే ఉత్తమ నటుడి రేసులో రిషబ్ శెట్టితోపాటు 12 ఫెయిల్ నటుడు విక్రాంత్ కూడా ఉన్నారు. అలాగే మమ్ముట్టి కూడా ఈ రేసులో ఉన్నారు. కానీ వీరందరి లో కాంతారా మూవీలోని నటనకి గానూ రిషబ్ శెట్టి కి అవార్డు వచ్చింది.ఈ అవార్డులు 2023 మే లోనే ప్రకటించాల్సి ఉంది.కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ మొత్తం మార్చాల్సి వచ్చింది. అలా 2022 నుండి మొత్తం 28 భాషల్లో విడుదలైన దాదాపు 300 సినిమాల నుండి నామినేషన్స్ వచ్చాయి. ఇక 70వ చలనచిత్ర పురస్కారాల్లో అవార్డ్స్ సాధించిన నటినటులు ఈ ఏడాది అక్టోబర్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకుంటారు