ఏపీ ఎన్నికల రిజల్ట్ ముందు వేణు స్వామి పేరు మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండేది. ఈయన చెప్పే జ్యోతిష్యానికి చాలా పేరు ఉండేది.కానీ ఎప్పుడైతే ఈయన చెప్పిన జ్యోతిష్యం ఏపీ ఎన్నికల్లో,తెలంగాణ ఎన్నికల్లో బోల్తా పడిందో అప్పటినుండి ఈయన కాస్త సైలెంట్ అయ్యారు. అయితే అనూహ్యంగా మళ్ళీ నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తో ఈయన జాతకం చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల పర్సనల్ విషయాలు బహిరంగంగా చెబుతూ వారి ప్రైవసీకి ఆటంకం కలిగిస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వేణు స్వామిపై కోలు కోలేని దెబ్బ కొట్టాలని చూస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది సెలబ్రెటీలు వేణు స్వామి జ్యోతిష్యం పై పిచ్చి కోపంగా ఉన్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన ఎన్నో విషయాలు బయటపెడుతూ వారి జీవితాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు.
దాంతో వేణు స్వామికి కోలుకోలేని దెబ్బ కొట్టాలని చూస్తున్నారట. ఆకలి మీద ఉన్న పులిలా టాలీవుడ్ ఇండస్ట్రీ వేణు స్వామి మీదకి దూకబోతున్నట్టు తెలుస్తోంది.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వేణు స్వామిపై కొంతమంది పెద్దలు కేసు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా సెలబ్రిటీల జీవితాన్ని మొత్తం సోషల్ మీడియాలో పెడుతూ వారి ప్రైవసీ కి భంగం కలిగిస్తున్న వేణు స్వామి పై ది తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ అలాగే తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ వాళ్ళు కేసు పెట్టి చర్యలు తీసుకునేలా ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకున్నారని వేణు స్వామి పై కేసు పెట్టి ఆయనకి తగిన గుణపాఠం చెప్పాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఇక దీనికి కారణం టాలీవుడ్ బడా ఫ్యామిలీ నుండి వచ్చిన నాగచైతన్య పర్సనల్ జీవితం గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో పాటు ఎంతోమంది సెలబ్రెటీలపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంతో సోషల్ మీడియాలో ఈయన వైరల్ గా మారుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో పాజిటివిటీ తీసుకురావడం కోసమే ఈయనపై చర్యలు తీసుకునేలా పోలీస్ కేసు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయం వైరల్ అవ్వడంతో చాలామంది వేణు స్వామి అంటే పడని వాళ్ళు ఇక వేణు స్వామికి ఇత్తడే.. కేసు పెడితే తట్టా బుట్టా సర్దాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.