మిస్టర్ బచ్చన్: మంటలు పుట్టిస్తున్న రవితేజ రొమాంటిక్ పోస్టర్..
రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన "మిస్టర్ బచ్చన్" సినిమా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ సినిమాలో యాక్షన్, ప్రేమ, కామెడీ అన్నీ ఉండనున్నాయి. రియల్ లైఫ్‌లో ఇండియన్ బిజినెస్ మాన్ సర్దార్ ఇందర్ సింగ్‌పై జరిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. ఈ సినిమా ఫుల్ ఎంజాయ్ మెంట్ ఆఫర్ చేయనుందని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ, దీనిపై క్రేజ్ బాగా పెరిగిపోతుంది.
ఇందులో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లగా చేస్తున్నారు. ఈ కొత్త సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఇంటెన్స్ రొమాంటిక్ సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఓ పోస్టరే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆ ఫోటోలో వీళ్ళిద్దరూ చాలా రొమాంటిక్‌గా ఒకరినొకరు పెన వేసుకున్నారు. మిగతా ప్రపంచాన్ని మరిచి రొమాన్స్ చేస్తున్నారు. ఈ ఫోటో చూసి సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్‌ని ఆగస్టు 7న విడుదల చేయబోతున్నామని ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు. ట్రైలర్‌తో సినిమా ఎలా ఉంటుందో ఒక ఐడియా అయితే రానుంది.
ఈ ట్రైలర్‌లో లవ్ స్టోరీ , యాక్షన్ సన్నివేశాలు రెండూ చాలా బాగుంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ వచ్చింది. అందులో ఈ రెండు అంశాలు కొద్దిగా కనిపించాయి. కానీ, ట్రైలర్‌లో మాత్రం సినిమా కథ ఎలా ఉంటుందో చాలా బాగా తెలుస్తుంది.
రవితేజ హీరోగా వస్తున్న "మిస్టర్ బచ్చన్" సినిమాని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కథ. రవితేజ ఈ ఒక ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇది ఆగస్టు 15న విడుదల కాబోతుంది. అంటే, స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ సినిమాని ప్రేక్షకులు థియేటర్లలో చూడొచ్చు. ఇదే రోజున రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీపై కూడా బాగానే బజ్ క్రియేట్ అయింది.