హార్దిక్ కోసం.. ఆ హీరోయిన్ ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిందట తెలుసా?

praveen
టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గత కొంతకాలం నుంచి తరచూ ఏదో ఒక అంశంపై వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్ సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి విమర్శలు ఎదుర్కొని వార్తల్లో నిలిచాడు. ఇక ఆ తర్వాత ప్రారంభమైన వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన చేసి ఇక సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఏకంగా వ్యక్తిగత విషయాలతో కూడా ఇలా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

 ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే నటాషా తో హార్దిక్ పాండ్యా విడిపోతున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది నిజం కాకపోయి ఉండొచ్చు అని అభిమానులు అనుకున్నారు. కానీ ఇటీవల విడాకులకు సంబంధించిన ఆఫీషియల్ ప్రకటన రావడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇలా భార్య నటాషా తో అభిప్రాయ బేధాలు తలెత్తడంతో  ఆమెకు విడాకులు ఇచ్చాడు. కొడుకుతో కలిసి ఇప్పుడు నటాషా సొంత దేశమైన స్వీడన్ కు వెళ్ళిపోయింది. కాగా భార్యతో విడాకులు తీసుకున్న హార్దిక్ ఒక బాలీవుడ్ హీరోయిన్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఆ హీరోయిన్ ఎవరో కాదు అనన్య పాండే. ఇక ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో కూడా వస్తుంది అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. ఇక హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. దీనికి తోడు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు  ఈ క్రమంలోనే ఇక వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరూ తరచూ కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే హార్దిక్ పాండ్యా కోసం తన పాత ప్రియుడు అయిన ఆదిత్య రాయ్ కపూర్ కి సైతం అనన్య పాండే బ్రేకప్ చెప్పేసింది అంటూ వార్తలు వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: