ఎన్టీఆర్ అంటే ఆ స్టార్ ప్రొడ్యూసర్ కి ఫుల్ రేస్పెక్ట్.. ప్రూఫ్ ఇదే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ ను ఇష్టపడేవారు ఎంతో మంది తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు, అలాగే ఇతర ఇండస్ట్రీలలో కూడా ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈయన ఎన్నో సార్లు ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం హీరోగా రూపొందుతున్న దేవర మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాలలో నాగ వంశీ అనే విడుదల చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూర్య దేవర నాగ వంశీ దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాను ఈయన సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో రూపొందుతున్న దేవర మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితోనే చాలా మంది నాగ వంశీ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా రెస్పెక్ట్. ఆయన లక్కీ భాస్కర్ మూవీ విడుదల తేదీని మారుస్తాడు అని చాలా మంది అనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే ఈయన లక్కీ భాస్కర్ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీ నుండి సెప్టెంబర్ 7 వ తేదీకి ప్రీ ఫోన్ చేశాడు. ఇలా నాగ వంశీ తన సినిమా విడుదల తేదీని మార్చి మరి తనకు ఎన్టీఆర్ పై ఉన్న రెస్పెక్ట్ ను మరోసారి నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: