తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిగ్ స్క్రీన్ ని హిట్ చేసి సాలిడ్ హిట్ ని సంపాదించుకుంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా విజయన్ని అందుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు యూఎస్ మార్కెట్ లో భారీ రికార్డు స్థాయిని తిరగరాస్తోంది. వీకెండ్ పూర్తికాకుండానే ఈ సినిమా నార్త్ అమెరికాలో 10 మిలియన్ డాలర్స్ మార్కెట్ దిశగా దూసుకుపోతోంది.
అంతేకాకుండా తాజాగా ఈ సినిమా 9 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది. దాంతో ఈ సినిమా నెక్స్ట్ పార్ట్ 10 మిలియన్ మార్క్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల మార్కను దాటేసింది. ఇక కల్కి సినిమా యుఎస్ మార్కెట్ లో ఏ స్థాయిలో దుమ్మురేపుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది లాంగ్ రన్ లో ఎక్కడ ఆగుతుందో అనేది కూడా ఆసక్తి కరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రభాస్ సరసన దీపికా పదుకొనే దిశా పటాని హీరోయిన్గా నటించగా కమల్ హాసన్
అమితాబ్ బచ్చన్, వంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇక ప్రభాస్ కెరీర్ లో కల్కి 2898 ఎడి సినిమా మరో రికార్డు నమోదు చేసింది. దానితో ప్రేక్షకులు తెగ సంబరాలు చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కళ్లు చెదిరే విజువల్స్, లీనం చేసే కథ, బలమైన పాత్రలతో మన రేపటి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ, వాటికి మన పురాణాల్ని మేళవిస్తూ కథ చెప్పిన తీరు బాక్సాపీస్ కొత్త చరిత్రకు నాంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.