కల్కి 2898AD: 5రోజుల్లో పవర్ ప్యాక్ ఆడేస్తున్న కల్కి కలెక్షన్స్..!

Divya
కల్కి 2898AD చిత్రం గత నెల 27వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇందులో అద్భుతంగా నటించారు. అలాగే అమితాబ్ బచ్చన్, కమలహాసన్ ,దీపికా పదుకొనే తదితర నటీనటులు సైతం నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామెన్స్ చేశారని చెప్పవచ్చు. కల్కి సినిమా నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. వారం రోజుల్లోనే కల్కి సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావట్టినట్లుగా ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తం మీద ఈ సినిమా 635 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలియజేస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో 1000 కోట్ల మార్పును అందుకుంటుంది అంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. ఇండియా వైడ్గా చేసుకుంటే నిన్న ఒక్కరోజే 34.6 కోట్ల రూపాయలు వసులు చేసిందని ప్రపంచవ్యాప్తంగా 45 నుంచి 50 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిందని మొత్తం మీద చూసుకుంటే సోమవారానికి 635 కోట్ల రూపాయలు వసూల్ సాధించిందట. కల్కి సినిమా తొలిరోజే 191 కోట్లతో మంచి కలెక్షన్స్ను రాబట్టింది. అలా మొదటిసారి కలెక్షన్ల వసూళ్లలో కేజిఎఫ్-2, సలార్ ,లియో వంటి చిత్రాలను అధిగమించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కల్కి సినిమాకి మహాభారతం వంటి సన్నివేశాలను లింక్ చేయడం వల్ల ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలిచింది. ఇందులో నటించిన అతిథి పాత్రలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాగ్ అశ్విన్ తన డైరెక్షన్తో ప్రేక్షకులను సైతం మాయ చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు కల్కి సినిమా సక్సెస్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ముఖ్యంగా పార్ట్-2 కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత అశ్వని దత్ మాట్లాడుతూ ఇప్పటికే 60% పైగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందంటూ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే విధంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: