ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తున్న కల్కి?

Purushottham Vinay
ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తున్న కల్కి?  

డార్లింగ్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది..కల్కి 2898 ఏడీ' మూవీకి అన్ని ఏరియాలు కలిపి మొత్తం రూ. 380 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 381 కోట్ల షేర్ రావాలి. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి ఏడో రోజు కూడా జనాల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.


ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 10 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. మిగిలిన అన్ని ఏరియాలూ కలుపుకుని మొత్తం రూ. 20 కోట్లు రాబట్టింది. ఈ సినిమా టోటల్ గా వారంలో రూ. 345 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 36 కోట్లు వసూళ్లు చేస్తే సరిపోతుంది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటిదాకా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకి ఓవర్ సీస్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటిదాకా 22 మిలయన్ డాలర్ల పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇంకా దూసుకుపోతుంది.ముఖ్యంగా నార్త్ అమెరికాలో షారుక్ ఖాన్ నుంచి గత ఏడాది వచ్చిన జవాన్, పఠాన్ కలెక్షన్స్ రికార్డ్ ని  చాలా ఈజీగా కల్కి 2898ఏడీ మూవీ అందుకుంది. ఐదు రోజుల్లోనే 12 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి మూవీ నిలబడింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి దాకా ఏ స్టార్ కూడా ఈ స్థాయిలో నార్త్ అమెరికాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇదంతా కూడా కల్కి కథ గొప్పతనం అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: