జియో యూజర్లకు బిగ్ అలర్ట్.. మీరు 5జీ డేటా పొందాలంటే ఇది తెలుసుకోవాల్సిందే!
28 రోజుల వ్యాలిడిటీతో 5g డేటా అందుబాటులో ఉండే ప్లాన్‌ల వివరాలను పరిశీలిస్తే రూ. 349 ప్లాన్ ఉంది. ఇంతకుముందు దీని ధర రూ. 299గా ఉండేది. ఇప్పుడు మీరు దాని కోసం రూ. 349 వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో ప్రతిరోజూ 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక ఆ తర్వాత రూ. 399 ప్లాన్ కూడా ఉంది. ఇంతకు ముందు ఈ ప్లాన్ ధర రూ. 349గా ఉండేది. దీనిని రూ.399కి పెంచారు. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ పొందొచ్చు. గతంలో రూ.399 ఉండే ప్లాన్ ధరను ప్రస్తుతం రూ.449కి పెంచారు. దీని ద్వారా ప్రతిరోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. 56 రోజుల వ్యాలిడిటీతో 5జీ ప్లాన్‌లను కూడా జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రూ.533 ఉండే ప్లాన్ ధరను రూ.629కి పెంచారు. దీని ద్వారా మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. గతంలో 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్ రూ.719 ఉండేది. అది రూ.859కి పెరిగింది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ అందుబాటులో ఉన్నాయి.