సంక్రాంతి తర్వాత.. ఏపీలో అసలు పండగ.. !
ఏంటా విశేషాలు..
1) రాష్ట్రంలో పీ-4ను మరింత వేగంగా అమలు చేస్తారు. ఈ నెల 20వ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పీ-4 అమలును మరింత వేగం చేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన 2 లక్షల కుటుంబాలను ఈ నెల 20 తర్వా త.. మార్గదర్శకులు దత్తత తీసుకుంటారు. అదేవిధంగా వీరికి విద్య, నివాసం వంటి ఏర్పాట్లను కూడా చేయనున్నారు. సో.. పీ-4 కార్యక్రమం త్వరలోనే మరిన్ని కొత్త పుంతలు తొక్కనుంది.
2) ప్రభుత్వ పథకాలపై సర్వే: ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలపై మరోసారి సర్వే సాగ నుంది. ఇప్పటి వరకు ఐవీఆర్ ఎస్ సహా అనేక రూపాల్లో సర్వే చేశారు. అయితే.. ఇప్పుడు మరిన్ని పథకా లను అమలు చేస్తున్న నేపథ్యంలో వాటిపైనా ప్రజల నుంచి సర్వే చేయనున్నారు. అంతేకాదు.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకు ఇంకా మేలైన కార్యక్రమాలు ఏమున్నాయి? గత ప్రభుత్వానికి ఇప్పటికీ .. ఉన్న తేడా వంటివాటిని తెలుసుకుంటారు.
3) ఇంటింటికీ ప్రభుత్వం: ఈ నెల 20వ తేదీ నుంచి ఇంటింటికీ ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రు లు, నాయకులు రానున్నారు. గతంలో గడపగడపకు నిర్వహించినట్టుగానే.. ఈ 18 మాసాల కాలంలో చేప ట్టిన పనులు.. ఇతరత్రా అంశాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీ నుంచి ఉద్యోగాల కల్పన వరకు పెద్ద ఎత్తున చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు. అదేసమయంలో ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు.