చేతెలెత్తేసిన జ‌గ‌న్‌... అఖ‌రి ఆస్త్రం కూడా అట్ట‌ర్ ప్లాప్‌..?

RAMAKRISHNA S.S.
శాసనమండలిలో తమకు ఉన్న బలంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్లాన్ వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశలు అడియాస‌లు కానున్నాయా ? జగన్ మండలిలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పిన జగన్ మాటను వైసీపీ ఎమ్మెల్సీలు లైట్ తీసుకుంటున్నారా ? మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేము .. అసలే మన పార్టీ పరిస్థితి బాగోలేదు అని నేరుగానే జగన్ కు చెప్పేశారా ? అంటే అవుననే చర్చ వైసిపి వర్గాల్లో నడుస్తుంది.. కాదు కూడదు అని జగన్ ఇంకా సొంత పార్టీ ఎమ్మెల్సీలను బెదిరించాలని చూస్తే వారు పార్టీకి సైతం గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్టు కూడా వైసిపి వర్గాల్లోనే ప్రచారం నడుస్తుంది. బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్ క్యాంప్ కార్యాలయంలో రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి తో పాటు భవిష్యత్తులో పార్టీని ఎలా నిలబెట్టాలి ? అనే కార్యచరణ పై జగన్మోహన్ రెడ్డి వారితో చర్చించారు. మండలి లో వైసీపీకి ఎక్కువ బలం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీని అన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టాలని జగన్ చేసిన సూచనలను కొంతమంది ఎమ్మెల్సీలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కాదు కూడదు అని జగన్ వారిని బెదిరించాలని చూసినా.. తాను చెప్పినట్టు వినాలని ఒత్తిడి చేసిన వారిలో చాలామంది పార్టీ వీడి టిడిపిలోకి వెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వైసిపి ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎవరెవరు పార్టీ వీడతారు అనేది చర్చ నీయాంశంగా మారింది.

ఏది ఏమైనా క‌నీసం మండ‌లి లో అయినా ప్ర‌భుత్వాన్ని అడ్డు క‌ట్ట వేయాల‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించేలా లేవు. చివ‌ర‌కు సొంత పార్టీ వాళ్లు సైతం జ‌గ‌న్ మాట వినే ప‌రిస్థితి లేద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ ఐదేళ్లు జ‌గ‌న్ ఎలా పార్టీని ముందుకు న‌డుపుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: