ఏపీ : నెల్లూరు జైలుకి మాజీ సీఎం జగన్..?

FARMANULLA SHAIK
మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. దాడులు జరిగిన కేడర్ కు అండగా నిలవాలని నిర్దేశించారు. తాను ప్రజల్లోకి వస్తానని వెల్లడించారు.రాజకీయ అంశాలపై పెద్దగా స్పందన లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన, బిజెపి కూటమికి కొంతకాలం సమయం ఇచ్చి, ఆ తర్వాత జనాల్లోకి రావాలని , అంతకంటే ముందుగా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి నాయకుల్లో ఉత్సాహం నింపే విధంగా జగన్ సైలెంట్ గా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక దాడులకు గురైన పార్టీ నాయకులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు జిల్లాల పర్యటనకు జగన్ సిద్దం అవుతున్నారు. ముందుగా పార్టీ నేతలు..కేడర్ పరామర్శకు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తొలి పర్యటన ఖరారైంది.మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ గురువారం నెల్లూరు కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చనున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంటు, మహిళపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. మాచర్ల కోర్టు 14 రోజులు విధించి నెల్లూరు సెంట్రల్‌ జైలుకు పంపారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా పిన్నెల్లిని పరామర్శించారు. ఇప్పుడు జగన్ నెల్లూరు జైలుకు రానున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ. 11.15గంటలకు జేజే కనుపర్తి పాడు జడ్పీ హై స్కూల్లో హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించనున్నారు.పోలింగ్ రోజు ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. ఆయన్ను పరామర్శించేందుకు జగన్ ఇప్పుడు నెల్లూరుకు వస్తుండటంతో స్థానిక నేతలు జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనపర్తిపాడు కు చేరుకొని హెలికాప్టర్ లో తాడేపల్లికి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: