మహేష్ నమ్మకాన్ని వొమ్ము చేసిన దర్శకులు వీరే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఇక మహేష్ బాబు తన కెరీర్లో తనకు మొదటి సారి విజయం ఇచ్చిన దర్శకులను నమ్మి రెండవ , మూడవ అవకాశం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలా మహేష్ నమ్మి వారికి అవకాశం ఇచ్చిన కొంత మంది దర్శకులు మాత్రం దానిని నిలబెట్టుకోలేక పోయారు. అలా మహేష్ కి మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఇచ్చి , ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందించలేకపోయిన దర్శకులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ ప్రారంభంలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మహేష్ బాబుకు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఈ దర్శకుడితో అర్జున్ అనే మూవీ ని చేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ దర్శకుడికి మహేష్ మరో అవకాశం ఇచ్చాడు. ఆయన మహేష్ తో సైనికుడు అనే మూవీ ని రూపొందించాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇక మహేష్ బాబు కొంత కాలం క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత మహేష్ ఈ దర్శకుడిని నమ్మి మరో అవకాశం ఇచ్చాడు. దానితో శ్రీను వైట్ల , మహేష్ తో ఆగడు అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల మొదటగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు మహేష్ తో బ్రహ్మోత్సవం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: