ఏపీ: బొత్స రాజకీయ ప్రయాణం ముగిసినట్టేనా..?

Divya
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈయన రాజకీయ పయనం ఎటువైపు అన్న చర్చ సాగుతోంది. అంతేకాదు బొత్స పక్కచూపులు చూస్తున్నారని.. అధికారపక్ష నేతలతో పాటు మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు.. ఇలా వార్తలు వైరల్ అవుతున్న నేపద్యంలో ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు బొత్స.. అయితే కొంతమంది వైసీపీ నేతలు మాత్రం బొత్స కొంతకాలం రాజకీయంగా విరామం ప్రకటించారని..ఆయన రాజకీయ జీవితంలో సంక్లిష్టమైన పరిస్థితి ఇది అని అందుకే కొంతకాలం దూరంగా ఉండబోతున్నారు అంటూ కొంతమంది చెబుతున్నారు..

ఇకపోతే 2019లో అందర్నీ తనవారినే గెలిపించుకొని సత్తా చాటిన ఈయన ఇప్పుడు తనతో పాటు అందరి ఓటమిని స్వయంగా చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ బాధను తట్టుకోలేక రాజకీయంగా పదవీ విరమణ కూడా ప్రకటిస్తారేమో అనే చర్చ కొనసాగుతోంది.. మరొకవైపు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల బదిలీ విషయంలో అవినీతికి పాల్పడ్డారని అధికార టిడిపి నేతలు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు రాజకీయంగానే దీనిని ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది.  అయితే బొత్స కుటుంబంలో ఆయన తమ్ముడు గణపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య,  బొత్స భార్య మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి రాజకీయంగా తప్పుకున్నట్లే అని చెబుతున్నార.  ఇక రానున్న రోజుల్లో ఈయన వైసీపీలో కొనసాగుతారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
గత ప్రభుత్వం హయాంలో ఎన్నో మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తామని ఎన్నో చెప్పారు. కానీ ఈసారి అనూహ్యంగా అందరూ ఓడిపోవడంతో మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఇక ఈయన రాజకీయ జీవితానికి స్వస్తి పెట్టబోతున్నారని కొంతమంది చెబుతూ ఉండగా.. మరికొంతమంది లేదు విరామం తీసుకుని మళ్లీ రెట్టింపు వేగంతో వస్తారని చెబుతున్నారు మొత్తానికి అయితే బొత్స రాజకీయ జీవితం ఎటువైపు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: