డైరెక్టర్ గా విఫలం అవుతూనే వస్తున్న స్టార్ రైటర్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ శాతం మంది దర్శకులు కథలను రాసుకునేవారు కాదు. కథలను రాయడానికి ప్రత్యేకంగా రైటర్స్ ఉండేవారు. వారు కథను రెడీ చేసేవారు. వారు రెడీ చేసిన కథ నచ్చినట్లు అయితే ఆ తర్వాత హీరోలను , హీరోయిన్లను సెట్ చేసుకొని మూవీలను తెరకెక్కించేవారు. ఇక ఈ మధ్యకాలంలో కథ రచయితల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఎవరైనా మంచి కథలను రాస్తున్నారు అంటే వారు కొంతకాలానికే దర్శకులుగా రూటు మారుస్తున్నారు. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ , కొరటాల శివ మొదటగా కథ రచయితలుగా పని చేసి ఆ తర్వాత డైరెక్టర్లుగా రూటు మార్చి ఫుల్ సక్సెస్ అయ్యారు.

మీరు మాత్రమే కాకుండా మరి కొంత మంది కూడా ఇలా సక్సెస్ అయిన వారు ఉన్నారు. ఇకపోతే తెలుగులో మంచి కథ రచయితగా పేరు తెచ్చుకున్న వారిలో వక్కంతం వంశీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీలకి స్టోరీలను అందించాడు. ఈ కథ రచయిత ఎక్కువ శాతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు కథలను అందించారు. వీరిద్దరి కాంబోలో రూపొందిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇలా ఈయన కథలతో రూపొందిన సినిమాలు మంచి సక్సెస్ అవుతూ ఉండడంతో ఈయన కూడా దర్శకుడిగా రూటు మార్చాడు. అందులో భాగంగా అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కాస్త టైమ్ తీసుకున్న ఈ దర్శకుడు నితిన్ హీరోగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన వక్కంతం వంశీ దర్శకుడిగా మాత్రం ఆ స్థాయి సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: