కల్కి రికార్డ్స్: అమిర్ ఖాన్ ని సమం చేసిన ప్రభాస్?

Purushottham Vinay
కల్కి రికార్డ్స్: అమిర్ ఖాన్ ని సమం చేసిన ప్రభాస్?  

'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ప్రస్తుతం కల్కికి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా . 590 కోట్లకు వచ్చేసాయి. కల్కి కథను, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు.భవిష్యత్తులో జరగబోయే ఒక ఊహాజనిత కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. యూఎస్ లో కల్కి సినిమా వసూళ్లు ఏకంగా $11 మిలియన్ వసూళ్లని దాటేసాయి. హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూళ్లు రూ. 120 కోట్లకి పైగా నెట్ వసూళ్లని దాటేశాయి.ఈ వారం కూడా నిలకడగా వసూళ్లు రాబడితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంటుంది. ఐదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.34.6 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజైన ఆదివారం (జూన్ 30) ఈ కలెక్షన్లు రూ.88.2 కోట్లు కాగా.. సోమవారం సగానికి సగం తగ్గాయి.అయితే ఐదో రోజు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. తెలుగులో ఈ మూవీకి రూ.14.5 కోట్లు రాగా.. హిందీలో రూ.16.5 కోట్లు వచ్చాయి. తమిళంలో రూ.2 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, మలయాళంలో రూ.1.3 కోట్లు వసూలు చేసింది.

తొలి రోజు ఇండియాలో రూ.95.3 కోట్లు వసూలు చేసిన కల్కి 2898 ఏడీ మళ్లీ ఆ స్థాయి వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది.నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకుపైగా వసూలు చేసిన ప్రభాస్ మూవీ.. ఫస్ట్ వీకెండ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో జవాన్ (రూ.520 కోట్లు)ను మించిపోయింది. ఇప్పటికీ హిందీ బెల్ట్ లో కల్కి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు అక్కడి సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ సూపర్ రికార్డ్ కొట్టాడు. 4 500 కోట్ల సినిమాలు కలిగిన స్టార్ హీరోగా అమీర్ ఖాన్ రికార్డుని సమం చేశాడు. అమీర్ ఖాన్.. ధూమ్ 3, పీకే, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలతో ఇప్పటిదాకా ఆ 4 సినిమాలతో మొదటి ప్లేసులో ఉండగా.. తాజాగా ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2, సలార్ ఇప్పుడు కల్కి.. మొత్తం 4 సినిమాలతో అమీర్ రికార్డుని సమం చేశాడు.  ఇక వీళ్ళద్దరి తరువాత సల్మాన్ ఖాన్ 3 సినిమాలు, రన్ బీర్ కపూర్ 2 సినిమాలు, రజినీకాంత్ 2 సినిమాలు, షారుక్ ఖాన్ 2 సినిమాల తో అమిర్, ప్రభాస్ తరువాతి స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: