మీనాక్షి చౌదరికి మొదటి అవకాశం ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.. అలా కూడా ఛాన్స్ వస్తుందా..?

MADDIBOINA AJAY KUMAR
చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం కోసం ఎన్నో సినిమా ఆడిషన్స్ కి వెళుతూ ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు ఫోటోషూట్లను చేయించి వాటిని దర్శకులకు, నిర్మాతలకు చూయించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత కొంతమందికి అవకాశాలు వస్తాయి. మరి కొంత మంది కి అవకాశాలు రాకపోయినా పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ మరి కొంత మంది కి మాత్రం అదృష్టం వెతుక్కుంటూ వచ్చినట్లు సినిమాల్లో అవకాశాలు దక్కుతూ ఉంటాయి.

అలా ఏ మాత్రం ప్రయత్నాలు చేయకుండా సినిమా పరిశ్రమలో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకొని ఆ తర్వాత స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిన వారు కూడా కొంతమంది ఉన్నారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండా సినీ పరిశ్రమలో అవకాశాలను దక్కించుకున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

ఈమె ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలలో కూడా నటిస్తోంది. ఈమె నటిస్తున్న తమిళ సినిమాలు మంచి విజయం సాధిస్తే ఈమెకు కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇకపోతే ఈమెకు ఇచట వాహనములు నిలపరాదు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అనుకుంటున్నారా... ఒక రోజు సుశాంత్ ఓ సినిమా ఈవెంట్ కు వెళ్లాడట. ఇక ఆ సమయంలో ఇచట వాహనములు నిలపరాదు సినిమా కథ లాక్ అయ్యింది.

కానీ హీరోయిన్ మాత్రం సెలెక్ట్ కాలేదు. దానితో పలువురు అమ్మాయిలను అనుకుంటున్న సమయంలో అనుకోకుండా సుశాంత్ ఈమెను చూడడం, దానితో ఈ అమ్మాయి బాగుంది. ఈమె మన సినిమాలో హీరోయిన్గా నటిస్తే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చాడట. దానితో ఆమెను సంప్రదించి మా సినిమాలో నటిస్తావా అని అడగడం, ఆమె కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా ఈ బ్యూటీకి ఇచట వాహనములు నిలపరాదు సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc

సంబంధిత వార్తలు: