"పుష్ప 1" హిట్ ఓకే... "పుష్ప 2" కోసం నిర్మాతలకి ఇంత భారమా..?

MADDIBOINA AJAY KUMAR
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మొదటి భాగం అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కడంతో ఈ సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పుష్ప సినిమాలో పహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన మొదటి భాగంలో చాలా తక్కువ నడివి ఉన్న పాత్రనే చేసినప్పటికీ అద్భుతమైన ఇంపాక్ట్ ను చూపించాడు. ఇక రెండవ భాగం లో ఈయన పాత్ర ఏ విధంగా ఉంటుందో అని జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ నటుడికి అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈయన ఈ సినిమా కోసం రోజు వారీగా పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు రోజుకు 7 నుండి 8 లక్షల రెమ్యూనరేషన్ చొప్పున తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ సినిమా కోసం ఈ నటుడు 35 నుండి 45 రోజుల కేటాయించనున్నట్లు దానితో ఈయన ఈ ఒక్క సినిమాకి 7 నుంచి 8 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతి నాయకుడి పాత్ర కోసమే  7 నుంచి 8 కోట్ల భారం మైత్రి సంస్థపై పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఫహద్ కి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ఉంది. అలాంటి నటుడికి 7 నుంచి 8 కోట్ల రెమ్యూనిరేషన్ పెద్ద విషయం ఏది కాదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: