ప్రభాస్ ఆఖరి 7 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.. అందులో "కల్కి" ఆ ప్లేస్ లో..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఆఖరి 7 మూవీ లకి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏ డి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 385 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , దీపిక పదుకొనే , దిశా పటానీ కీలక పాత్రలల్ నటించగా , కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.
ప్రభాస్ కొంత కాలం క్రితం సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 345 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ కొంత కాలం క్రితం ఆది పురుష్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరో గా పూజ హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాధే శ్యామ్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకి 352 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 118 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: