అమీషా పటేల్ : ఛీ.. ఛీ.. నేనేంటి అలాంటి పాత్రలు చేసేదేంటి..!

murali krishna
ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించడం అంటే అంత సులభం కాదు.. ఒకానొక సమయంలో బిజీగా గడిపిన స్టార్ హీరోయిన్స్ కూడా ఇప్పుడు సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో కొంతమంది సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో నిలుస్తుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ ఒకరు. ఇటీవల వచ్చిన గదర్‌ 2 సినిమా తర్వాత మరోసారి హాట్ టాపిక్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులాంటి బడా హీరోల సినిమాల్లో నటించి అలరించింది. బద్రి, నాని లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ బ్యూటీ ఆతర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. అక్కడే కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ గుర్తింపు సంపాదించుకుంది.ఈ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గదర్‌ 2 సినిమాతో సీనియర్ హీరో సన్నిడియోల్‌తో పాటు అమిషా పటేల్‌ కూడా కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న అమిషా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా అమ్మడి గ్లామర్‌ షో ఇటీవల హాట్ టాపిక్ అయ్యింది. ఈ రేంజ్‌లో గ్లామర్ ఇమేజ్‌ ఉన్న ఈ బ్యూటీ వెండితెర మీద మాత్రం బోల్డ్ సీన్స్ చేయడంలో మాత్రం కండీషన్స్ పెడుతుంది. తాజాగా అమీషా పటేల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అంటీ పాత్రలు చేయనంటూ డైరెక్ట్‌గా చెప్పేసింది.ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఎప్పటికీ ఆంటీ పాత్రలు, తల్లి పాత్రల్లో నటించను. నాకు అవకాశాలు వచ్చినంత కాలం హీరోయిన్ గానే చేస్తాను. నా వయసున్న నటీమణులు చాలా మంది ఆంటీలుగా నటిస్తున్న సంగతి నాకు కూడా తెలుసు. కాకపోతే అలాంటి పాత్రల్లో నటించడం నాకు మాత్రం ఇష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: