కమల్ హాసన్ : కల్కి సినిమా అంగీకరించడానికి ఎంతో ఆలోచించా.. చివరికీ ?

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు .ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ నటించారు.. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసారు.థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం చూసిన పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కల్కి'లో  కీలకపాత్ర పోషించిన కమల్‌ హాసన్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ప్రభాస్‌ భైరవగా ప్రధానపాత్ర పోషించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో కమల్‌ హాసన్‌ విలన్‌గా సుప్రీం యాస్కిన్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. 

తాజాగా చెన్నైలో ఈ చిత్రాన్ని ఆయన చూశారు. ''కల్కి' రెండో భాగంలో తన పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన ముందే చెప్పారు. ఒక అభిమానిగా మొదటి భాగం చిత్రీకరణలో తాను పాల్గొన్నానని ఆయన తెలిపారు.దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు ఓర్పు ఎక్కువ. పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి కల్కిని ఎంతో అందంగా రూపొందించారు. ఆయన చాలా ఓపికగా కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు'' అని కమల్‌ ప్రశంసించారు.ఇక రీసెంట్ గా కూడా కమల్‌  ఈ చిత్రం గురించి మాట్లాడుతూ కల్కి సినిమాను అంగీకరించడానికి ఏడాది పాటు ఆలోచించినట్లు తెలిపారు. గతంలో ఎన్నో సినిమాల్లో  విలన్‌గా నటించిన ఆయనకు కల్కిలోని యాస్కిన్‌ పాత్ర ఎంతో భిన్నంగా కనిపించిందని అన్నారు.. కథ చెబుతూ తన పాత్ర గురించి చెప్పగానే నేను చేయగలనా అనే సందేహం వచ్చినట్లు ఆయన తెలిపారు. నాగ్ అశ్విన్ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేసారు. అందుకే ఈ పాత్ర ఎంతో ఛాలెంజింగ్ అనిపించి ఒప్పుకున్నాను అని కమల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: