'కల్కి' ట్రైలర్ ఫై రాజమౌళి రివ్యూ.. ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఒకే సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు  అదే జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోయే కల్కి ఏడి 2898 సినిమా గురించి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైథాలజీ,  ఫ్యూచరిస్టిక్ అనే కాన్సెప్ట్ తొ తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

 అయితే ముందుగా కల్కి సినిమా అన్ని సినిమాల లాగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్లు విడుదలైన తర్వాత ఇది చూసి ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. ఊహకందని రీతిలో నాగ్ అశ్విన్ ప్రేక్షకులు అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది  ఏకంగా హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నే రేంజ్ లో ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. కాగా ప్రస్తుతం చిత్ర బృందం ఇక ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది  

 అయితే ఈ సినిమా ట్రైలర్ను చూసి ఎంతోమంది దర్శక నిర్మాతలు కూడా ప్రశంసలు కురిపిస్తుండగా.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా కొనసాగుతున్న దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ఇది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఈ ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అమితాబ్ జీ, డార్లింగ్ ప్రభాస్, దీపికా పాత్రలు చాలా డెప్త్ ను కలిగి ఉంటాయని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక కమల్ సర్ లుక్ చూసి నేను షాక్ అయ్యా. ఇప్పటికి ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్న. ఎప్పటిలాగానే ఆయన తన పర్ఫామెన్స్ తో ఎలా ఆశ్చర్యపరుస్తాడో చూడాలి. ఇక నాగి జూన్ 27వ తేదీన నీ అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశించడానికి వేచి ఉండలేకపోతున్నా అంటూ జక్కన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. జక్కన్న పోస్టుతో ఈ మూవీ పై ఉన్న అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: