కల్కి సూపర్ సక్సస్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న ఆసందేహాలు !
ఇది అంతా నాణానికి ఒకవైపు మాత్రమే కనిపించే విషయం. అయితే ఈ మూవీ కథ సగటు ప్రేక్షకుడుకి అర్థం అవుతుందా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. హాలీవుడ్ స్టైల్ తగ్గని సైన్స్ ఫిక్షన్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్నినాగ్ అశ్విన్ ఒక డిఫరెంట్ గా తీసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈమూవీలో కనిపించే విజువల్స్ అద్భుతంగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహంలేదు.
ఈసినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్ లు ప్రోమోలు సగటు ప్రేక్షకుడు ఎన్నిసార్లు చూసినా అతడికి ఈమూవీ కథ అర్థం కావడంలేదు అన్న ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా ముంబాయిలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈమూవీ కథను విడమరిచి చెప్పినప్పటికీ ఈ కథ విషయంలో సగటు ప్రేక్షకుడు ఇప్పటికైతే ఒక క్లారిటీకి రాలేకపోతున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి.
క్రేజీగా కథ వ్రాయడం బాగానే ఉన్నప్పటికీ ఆకథను కేవలం మూడు గంటలలో సగటు ప్రేక్షకుడుకి అసహనం కలగకుండా నాగ్ అశ్విన్ ఎంతవరకు తీసి మెప్పించగలిగాడు అన్న విషయం ఈమూవీ విడుదల అయితే కానీ తెలియదు. ఈకథను నాగ్ అశ్విన్ కన్విన్సింగ్ గా తీయగలిగితే ఈమూవీ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది మరేమవుతుందో వేచి చూడాలి..