ఆ సినిమాలో నటించడం.. నా కెరియర్ లోనే చెత్త నిర్ణయం : నయనతార

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లో కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటికే తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తోంది. ఏకంగా హీరోలతో సమానంగానే గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మా లేడీ సూపర్ స్టార్ అనే పేరును సంపాదించుకుంది.

 అయితే కెరియర్ మొదట్లో ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి తన అందాల ఆరబోతతో అందరిని మతి పోగొట్టిన నయనతార.. ఇక ఇప్పుడు మాత్రం కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే ఇక ప్రస్తుతం సీనియర్ హీరో సినిమా ఏదైనా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే చాలు డైరెక్టర్లు అందరికీ మొదటి ఆప్షన్ నయనతార అన్నట్లుగా మారిపోయింది. అదే సమయంలో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. కాగా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు కూడా తల్లిగా మారింది నయనతార.

 ఇకపోతే ఈ స్టార్ హీరోయిన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. సూర్య నయనతార కాంబినేషన్లో వచ్చిన గజిని మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ హీరోయిన్. గజిని సినిమాలో నటించడం తన జీవితంలోనే నేను తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ నాయనతార అన్నారు. గజిని  సినిమాలో ముందు అనుకున్న విధంగా నా పాత్రను తెరకెక్కించలేదు. ఈ విషయంలో నేను ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటినే గుణపాఠంగా స్వీకరిస్తాను అంటూ నయనతార చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: