హరిహర వీరమల్లు సెట్స్ లోకి అడుగు పెట్టనున్న పవర్ స్టార్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పొలిటికల్ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయాన్ని సాధించిన పవర్స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని పొందారు. అయితే తన రాజకీయాల కోసం మొదలుపెట్టిన సినిమాలను మధ్యలోనే ఆపేసి మరి రాజకీయాలపై ఫోకస్ చేశారు.  తాజాగా ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు రావాలి అని ప్రయత్నిస్తున్నట్లు గా తెలుస్తోంది.  ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు నుండి ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో

 హరిహర వీరమల్లు  ఉస్తాద్ భగత్  సింగ్ వంటి సినిమాలు ఉన్నాయి.  రెండు భాగాలుగా రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా 50 శాతం పూర్తయింది. అయితే ఇప్పుడు మళ్లీ మిగిలిన కొంత భాగం షూటింగ్ పూర్తిచేసి పార్ట్ వన్ వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కాల్ షీట్స్ హరిహర వీరమల్లు కే కేటాయిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలు సైతం పవన్ కళ్యాణ్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ కి సంబంధించిన అన్ని

 పనులను పూర్తిచేసుకుని ఉండండి త్వరలోనే షూటింగ్లో జాయిన్ అవుతాను అని తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతలకి చెప్పినట్లుగా సమాచారం. కానీ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదట.  తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు.. ఈనెల అంటే జూన్ చివరిలో లేదా జులై ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతలు అందరూ ఈ విషయంపై చర్చించుకున్న నేపథ్యంలోనే ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అలా ఈ సినిమా నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: