నార్త్ లో కల్కి జోరు.. హిందీ నుండి "కల్కి" కి మొదటి రోజు ఎంత వచ్చే అవకాశం ఉందంటే..?

MADDIBOINA AJAY KUMAR
మిర్చి సినిమా వరకు ప్రభాస్ తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. ఆ తర్వాత ప్రభాస్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీలలో హీరోగా నటించాడు. ఈ మూవీ లు అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సిరీస్ మూవీ లతో ప్రభాస్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్ ఏరియా నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించడం మొదలు అయింది. దానితో బాహుబలి సినిమా తర్వాత నుండి ప్రభాస్ ఏ సినిమా నటించిన ఆ మూవీ కి హిందీ సినీ ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇకపోతే తాజాగా ప్రభాస్ "కల్కి 2898 ఏడి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ రేపు అనగా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ని హిందీ లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ను చూసి బాలీవుడ్ వ్యాపార వ్యక్తులు ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో హిందీ వర్షన్ కోసం అడ్వాన్స్ బుకింగ్ లో అద్భుతమైన నోట్ లో ప్రారంభం అయ్యాయి.

అలాగే మొదటి రోజు దాదాపుగా 20 కోట్లు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు బాలీవుడ్ ఏరియా నుండి వచ్చే అవకాశాలు ఉన్నట్లు , ఒక వేళ సినిమాకు గనక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే తొలి రోజే ఈ సినిమాకు హిందీ ఏరియా నుండి 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇలా ప్రభాస్ హీరో గా నటించిన కల్కి మూవీ కి హిందీ నుండి పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు చాలా మంది బాలీవుడ్ సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: