బాలయ్య సినిమా అంటే ఆ సస్పెన్స్ కంపల్సరా... "ఎన్బికె109" కి కూడా అదే పరిస్థితి..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుత వరుస విజయాలతో అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.  ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్ బి కే 109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ సినిమా కోసం ప్రస్తుతం రెండు , మూడు పవర్ఫుల్ టైటిల్ లను మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందులో ఏదో ఒక దానిని మరో 10 , 15 రోజుల్లో మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ నటించిన ఏ సినిమాకు అయినా ఈ సస్పెన్స్ కంపల్సరిగా ఉంటుంది. కొంత కాలం క్రితం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఆల్మోస్ట్ చివరి వరకు ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తోనే మూవీ బృందం పూర్తి చేస్తూ వచ్చింది.

ఈ సినిమాకు చాలా టైటిల్స్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. చివరగా ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి ఈ మూవీ కి వీర సింహా రెడ్డి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ "భగవంత్ కేసరి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బృందం కూడా చాలా రోజుల పాటే ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వచ్చింది.

ఈ మూవీ కోసం కూడా రెండు , మూడు టైటిల్స్ ను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. చివరగా భగవంత్ కేసరి నీ కన్ఫామ్ చేశారు. ఇక ఎన్ బి కే 109 పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ మూవీ కి టైటిల్ ను చాలా రోజుల క్రితం నుండి అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నా ఈ మూవీ కి టైటిల్ నీ ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు. మరి చివరగా ఈ సినిమాకు ఎలాంటి పవర్ఫుల్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇకపోతే ఈ సినిమాపై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: