కల్కి సినిమాటిక్ యూనివర్స్: మొత్తం ఎన్ని పార్ట్ లంటే?

Purushottham Vinay
తెలుగు సినిమాని మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళింది కల్కి 2898 ఏడీ. ఇప్పటికే మన ఇండస్ట్రీ నుంచి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించి మన సినిమా ఖ్యాతిని పెంచగా..ఇప్పుడు 'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ఇంకా రాబడుతుంది కూడా. అయితే 'కల్కి' సినిమా కథ ఇంతటితో ముగిసిపోలేదని.. దీనికి కొనసాగింపు కూడా ఉంటుందని మేకర్స్ సినిమాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కల్కి 2898 AD' లో ప్రపంచం కొనసాగుతుంది అని క్లైమాక్స్ లో పేర్కొన్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఐతే ఈ కథ ఇంకా ఎన్ని భాగాలు ఉంటుంది.. ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాల్లో మాత్రం క్లారిటీ లేదు.అయితే నిర్మాత అశ్వినీదత్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.'కల్కి' కథ రెండు భాగాలే అని.. సెకండ్ పార్ట్‌తో ఈ కథ ముగిసిపోతుందని ఆయన చెప్పాడు. ఆల్రెడీ సెకండ్ పార్ట్‌కు సంబంధించి 60 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో మాత్రం చెప్పలేనన్నాడు. 


2026లో 'కల్కి-2' సినిమా రిలీజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 'కల్కి' కథను రెండో భాగంతో ముగించినప్పటికీ.. ఇందులో విలన్ పాత్ర మీద స్టాండ్ అలోన్ మూవీ ఉండొచ్చని కూడా అశ్వినీదత్ వెల్లడించడం విశేషం.యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్ర సినిమాలో అమితాసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. కానీ ఆ పాత్రను సినిమాలో మాత్రం పెద్దగా చూపించలేదు.అయితే సెకండ్ పార్ట్‌లో ప్రభాస్, కమల్‌ల మధ్య భారీ పోరాటం ఉంటుందని.. కమల్, ప్రభాస్ ఇంకా అమితాబ్ కలిసి కనిపించే సన్నివేశాలు ఫీస్ట్ అని చెప్పిన అశ్విని దత్.. సుప్రీం యాస్కిన్, అతడి కాంప్లెక్స్ కథ ఎంతో స్పెషల్‌గా ఉంటుందని.. దాని మీద వేరే సినిమా కూడా రావచ్చని చెప్పారు. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్‌'లో చివర్లో కనిపించే రోలెక్స్ పాత్ర మీద కూడా ఒక స్టాండ్ అలోన్ మూవీ చేయాలని దర్శకుడు లోకేష్ కనకరాజ్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సుప్రీం యాస్కిన్ పాత్ర మీద కూడా అలాంటి సినిమా తీయాలనీ నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: