నారా భువనేశ్వరికి రూ.521 కోట్లు..లోక్‌ సభలో రచ్చ ?

Veldandi Saikiran
లోక్ సభ  సమావేశాలలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కుటుంబ ఆస్తులు, స్టాక్ మార్కెట్లో లాభాల గురించి  తృణమూల్ కాంగ్రెస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మంగళవారం రోజున...  లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై... తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

మోడీ ప్రభుత్వంలో అందరూ అవినీతిపరులే ఉన్నారని... అవినీతిపరులనే... ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారని నిప్పులు చెరిగారు. అవినీతి పరుల తో  జతకట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని కూడా సంచలన వ్యాఖ్యలు వచ్చేశారు. ఈ క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది తృణమూల్ కాంగ్రెస్. మొన్న ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు...  సపోర్ట్ ఇవ్వడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది.
 

ఎన్నికల కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు... అవినీతి కేసులో అరెస్టు అయ్యాడని... అలాంటి నేతను nda కూటమిలో చేర్చుకున్నారని..విమర్శించారు. మొన్నటి వరకు అవినీతిపరుడుగా ఉన్న చంద్రబాబు... ఎన్నికల తర్వాత... వాషింగ్ మిషన్ లో వేసిన సర్ఫ్ ఎక్సెల్ లో మారిపోయాడని చురకులు అంటించారు. బిజెపి కూటమికి 400 సీట్లు దాటుతాయని ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రచారం చేసి... స్టాక్ మార్కెట్లో షేర్లను  గందరగోళానికి గురి చేశారని నిప్పులు జరిగారు.
 

దాని ఫలితంగా ఎన్నికల రిజల్ట్స్ తర్వాత... టిడిపి అగ్రనేత భార్య భువనేశ్వర్ కి చెందిన కంపెనీ... 521 కోట్లు... సంపాదించిందని ఆరోపణలు చేశారు. ఇదంతా బిజెపి కూటమి ఆడిన నాటకం అంటూ మండిపడ్డారు. దీనిపై విచారణ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. అయితే..దీనిపై టీడీపీ పార్టీ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. కాగా.. nda కూటమికి చంద్రబాబు సపోర్ట్ ఇచ్చిన తర్వాత... హెరిటేజ్ ఆస్తులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: