ప్రభాస్ హీరోగా
నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీసిన
కల్కి 2898 ఏడి మూవీని
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై
అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్
ఇండియా చిత్రంలో
బాలీవుడ్ స్టార్
హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్
ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన
తమిళ స్టార్ మ్యూజిక్
డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.
జూన్ 27 వ తేదీన విడుదలైన ఈ
సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్
బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని
బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.
ఇక ఇప్పటి వరకు
టాలీవుడ్ బాక్సాఫీస్ నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో
ఆర్ఆర్ఆర్ టాప్ ప్లేస్ లో ఉంది. ఈ
సినిమా మొదటి వారం ఏకంగా 187.65 కోట్ల షేర్ అందుకుంది. దీని తర్వాత స్థానంలో
కల్కి 2898ఏడీ
మూవీ నిలిచింది. ఇది ఏకంగా 135.32+ కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోగలిగింది. దీని తర్వాత స్థానంలో
ప్రభాస్ సలార్ నిలిచింది. ఇది తెలుగు రాష్ట్రాలలో మొదటి ఏడురోజుల్లో 128.54 కోట్ల షేర్ వసూళ్లని సాధించింది.తరువాత నాలుగో స్థానంలో
బాహుబలి 2
సినిమా ఉంది. ఇది 117.92 కోట్ల షేర్ ని మొదటి వారం రోజుల్లో అందుకుంది. దీని తర్వాత రీజనల్ మూవీగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ
సినిమా టాప్ 5లో ఉంది. ఈ చిత్రం మొదటి వారం 89 కోట్ల షేర్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుంది. ఇప్పుడు
కల్కి 2898 ఏడి
మూవీ కలెక్షన్స్ పరంగా టాప్ 4లో ఉన్న చిత్రాలన్నింటిని బ్రేక్ చేసి టాప్ 2 లోకి వచ్చింది.