కల్కి ఓవర్! జులై సెకండ్ వీక్ నుంచి ఈ సినిమాల సందడి స్టార్ట్?

Purushottham Vinay

కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇక జూలై సెకండ్ వీక్ నుంచి థియేటర్లలోకి మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. కమల్ హాసన్ నటించిన 'ఇండియన్ 2' సినిమా జులై 12న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఇది 1996లో సంచలన విజయం సాధించిన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్. తెలుగులో 'భారతీయుడు 2' పేరుతో విడుదల అవుతుంది. 


ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నేటి సమాజంలోని అవినీతి, లంచగొండితనాన్ని తెర మీద ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ శంకర్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ & ట్రైలర్ మాత్రం జనాల దృష్టిని ఆకర్షించాయి. 28 ఏళ్ల తర్వాత శంకర్ - కమల్ కలిసి ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నారో చూడాలనే ఆసక్తిని కలిగించారు. ఇక జూలై 19వ తేదీన 'డార్లింగ్‌' సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రియదర్శి పులికొండ, నభా నటేష్‌ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు  అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'హను-మాన్' వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ ను నిర్మించిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి.. తన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు.


ఇక అల్లు శిరీష్ చాలా కాలం తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా 'బడ్డీ'. ఇందులో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటించగా.. అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించారు. ఒక టెడ్డీ బేర్‌ కథలో కీలకంగా ఉండబోతోంది. టెడ్డీ బేర్‌ అన్యాయంపై పోరాడటం అనే కొత్త పాయింట్ తో ఈ సినిమా తీశారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక జూలై 26న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అలాగే 26న 'బడ్డీ'తో పాటుగా 'రాయన్' సినిమా కూడా రిలీజ్ అవుతోంది. తమిళ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది ధనుష్ కెరీర్ లో 50వ మూవీ కావడంతో మంచి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: