ఆ మల్టీస్టారర్ మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టి.. మనమే హిట్ తో మళ్లీ క్రేజ్ పెరిగిందా..?

Pulgam Srinivas
మలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలలో నటించి అక్కడ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు కేవలం మలయాళ సినిమాలలో మాత్రమే నటించడం కాకుండా అనేక ఇతర భాష సినిమాలలో కూడా నటించడానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే తెలుగులో కూడా పలు సినిమాలలో నటించాడు. ఈయన తెలుగులో ఇప్పటికీ మహానటి , సీత రామం సినిమాలలో నటించి ఈ రెండు మూవీలలో కూడా మంచి విజయాలను తెలుగు లో అందుకున్నాడు.

ఈ రెండు మూవీలతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం కూడా ఈయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ఈ నటుడు కాంత అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి దగ్గుపాటి రానా కూడా హీరోగా కనిపించబోతున్నాడు.

ఈ మల్టీ స్టారర్ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి కృతి శెట్టి నీ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ ఉప్పెన , శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీలతో మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా అపజయాలు వచ్చాయి. ఇకపోతే చాలా రోజుల తర్వాత ఈమెకు మనమే అనే మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం వచ్చింది. తాజాగా ఈమెకు కాంత అనే మల్టీ స్టారర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks

సంబంధిత వార్తలు: