ప‌త‌న చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టిన రేవంత్‌రెడ్డి.. త‌న కొమ్మ తానే న‌రుక్కుంటున్నాడా..?

RAMAKRISHNA S.S.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఎంతో మంది.. ఇంకా చెప్పాలంటే ప‌దేళ్ల కేసీఆర్ .. బీఆర్ ఎస్ పాల‌న మీద విసిగిపోయిన ప్ర‌తి న్యూట్ర‌ల్ జ‌నాలు.. చివ‌ర‌కు బీఆర్ ఎస్‌లోనే కొంద‌రు వీరాభిమానులు.. ఇటు కాంగ్రెస్ వాళ్లు... తెలంగాణ లో ఉన్న తెలుగుదేశం అభిమానులు మాత్ర‌మే కాకుండా.. ఏపీలో ఉన్న తెలుగుదేశం సింప‌తైజ‌ర్స్‌.. ఇక వైసీపీలో  అంద‌రూ కాక‌పోయినా కొంద‌రు రెడ్డి అభిమానులు అంద‌రూ కూడా రేవంత్ రెడ్డి ఒక్క‌సారి అయినా తెలంగాణ ముఖ్య‌మంత్రి అయితే బాగుంటుంద‌ని కోరుకున్నారు.

హైద‌రాబాద్ ఆర్బ‌న్ ఓట‌రుకు రేవంత్ సీఎం అవ్వ‌డం ఇష్టం లేక‌పోయినా.. తెలంగాణ గ్రామీణ ఓట‌రు మాత్రం కాంగ్రెస్‌కు ఓటేసి రేవంత్‌ను సీఎంను చేశారు. సీఎం అయ్యాక రేవంత్ పాల‌న మీద పెట్టిన ఫోక‌స్‌తో పాటు ఆయ‌న ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేర్చే క్ర‌మంలో మంచిగానే స్టార్ట్ చేశారు. అయితే జంపింగ్‌ల రాజ‌కీయం విష‌యంలో మాత్రం కేసీఆర్‌నే ఫాలో అవుతూ.. అసలు రాష్ట్రంలో పాల‌న కంటే ప్ర‌తిప‌క్షాల మీద కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది.

అస‌లు ఇప్ప‌టికిప్పుడు బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను వ‌రుస పెట్టి రేవంత్ కాంగ్రెస్ లో చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఏం ఉంది... బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకుంటూ వాళ్ల‌కు కేబినెట్ ర్యాంకులు ఉన్న ప‌ద‌వులు ఇస్తూ.. కాంగ్రెస్ కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డిన వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టేసే సంస్కృతికి రేవంత్ కూడా శ్రీకారం చుట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆరుగురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర‌గా.. ఇప్పుడు మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేల ను సైతం కాంగ్రెస్ కండువా క‌ప్పుకుని పార్టీ లో చేర్చుకునేందుకు రేవంత్ ఉత్సాహ ప‌డుతున్నారు.

దీంతో ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండి కాంగ్రెస్ కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డిన నిజ‌మైన నేత‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌ర‌గ‌నుంది. ఏదేమైనా రేవంత్ ఇలాంటి రాజ‌కీయం చేస్తూ పోతే త‌న ప‌తనానికి తాను శ్రీకార అక్ష‌రం రాసుకున్న‌ట్టు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: