
కూతురిపై అత్యాచారం.. వందేళ్ళ జైలు శిక్ష వేసిన కోర్టు?
ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా తండ్రి అంటే పిల్లలకు ఎప్పుడు రక్షణగా ఉండాలి. పైకి గంభీరంగా కనిపించిన లోలోపుల మంత్రం కొండంత ప్రేమను పెంచుకుంటాడు తండ్రి. ఈ క్రమంలోనే పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. పిల్లల కోసం ఎప్పుడు పని చేస్తూ తన జీవితాన్ని సైతం త్యాగం చేస్తూ ఉంటాడు. ఇలా తండ్రి గురించి చెబుతూ ఉంటే ఎంత గొప్పగా అయినా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక తండ్రి మాత్రం మనిషిలా కాదు మృగంలా మారిపోయాడు. కన్న కూతురు పైన కామపు కోరికలు తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఏకంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ తండ్రి ప్రవర్తించాడు.
ఇలా కుమార్తపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన తండ్రికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఏకంగా 101 ఏళ్ళ జైలు శిక్షతో పాటు యావత్ జీవ కారాకార శిక్షణ కూడా విదిస్తూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కేరళలోని మల్లపురానికి చెందిన స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ సంచలన తీర్పుని ఇచ్చింది. 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి ఆరేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. చివరికి ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి వచ్చింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి నిందితుని అరెస్టు చేసి పూర్తి ఆధారాలతో కోర్టులో సమర్పించగా.. కోర్టు ఈ తీర్పును వెలువరించింది.