కల్కితో షారుఖ్ రికార్డులని నమిలి మింగేసిన ప్రభాస్?

Purushottham Vinay
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ఇంకా కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లు రాబట్టింది.ఇప్పుడు బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో టిక్కెట్‌ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.కల్కి సినిమాతో ఒక అరుదైన రికార్డ్ బ్రేక్ అయింది. నిన్న మధ్యాహ్నం 1 గం.కు 'కల్కి 2898 AD' సినిమాకి సంబంధించి గరిష్ఠంగా 90k టిక్కెట్లు అమ్ముడయ్యాయి.బుక్‌మైషో ఒక గంట వ్యవధిలో ఏకంగా 93.77k టిక్కెట్లు అమ్ముడయ్యాయని వెల్లడించింది. దీంతో ఈ సినిమా కొత్త రికార్డు సృష్టించింది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ ఈ రికార్డును నెలకొల్పింది. సెప్టెంబరు నెలలో జవాన్ సినిమా విడుదల కాగా, ఒక గంటలోపు 86 వేల టిక్కెట్లను విక్రయించి ఈ రికార్డ్ నెలకొల్పింది.


ఇప్పుడు ఆ రికార్డ్ ప్రభాస్ సినిమాతో బ్రేక్ అయింది.'కల్కి 2898 AD' శనివారం నాటికి, అంటే 3వ రోజున రూ. ఏకంగా 67.1 కోట్ల ఇండియా వైడ్ నెట్‌ని వసూలు చేసింది. దీంతో కల్కి 2898 AD భారతదేశంలో కేవలం మూడు రోజుల్లోనే రూ. 220 Cr (సుమారు) వసూలు చేసిన చిత్రంగా రికార్డుల్లో నిలిచింది. ముఖ్యంగా తెలుగు షోలు (రూ. 126.9 కోట్లు), హిందీ (రూ. 72.5 కోట్లు), తమిళం (రూ. 12.8 కోట్లు) వసూలయ్యాయి. కల్కి 2898 AD సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం మూడవ రోజు 100 కోట్ల రూపాయల (గ్రాస్) వసూలు చేసింది. ఈ ఆదివారం కూడా  120 కోట్లు పైగా వసూలు చేసిందని సమాచారం తెలుస్తుంది. ఇది కలుపుకుంటే ఇండియాలో ఇప్పటికే 300 కోట్ల వసూళ్ల క్లబ్ ని కల్కి అధిగమించి ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే దాదాపు 500 కోట్ల పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: