అధికారం వచ్చి నెలే కాలేదు అప్పుడే ఇన్ని కూల్చివేతల..?

Pulgam Srinivas
ఏ రాష్ట్రంలో అయినా ఒక పార్టీ అధికారం నుండి దిగి మరో పార్టీ అధికారంలోకి వచ్చినట్లు అయితే గతంలో ప్రభుత్వం చేసిన ఎన్నో పనులను కొత్త ప్రభుత్వం ఎండగాడుతూ ఉంటుంది. వారు అధికారంలో ఉన్నప్పుడు అలా తప్పులు చేశారు.. ఇలా తప్పులు చేశారు. వాటి వల్ల ఎంతో ప్రజాదనం వృధా అయ్యింది. ఇలా ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే వారు గతంలో ఏదైనా తప్పు చేసి ఉంటే దానిని ఎత్తి చూపేందుకు గట్టి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీరు అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలలో తెలుగు దేశం పార్టీ ఆ తప్పులు చేసింది.. ఈ తప్పులు చేసింది అని ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇక వీరు వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసింది మరియు ఎన్నో భవనాలను ప్రభుత్వ స్థలాలలో నిర్మించింది అని అంటూ వస్తుంది. ఇక వైసిపి ప్రభుత్వం నిర్మించిన కొన్ని భవనాలను ఇప్పటికే తెలుగు దేశం ప్రభుత్వం కూల్చి వేసింది. ఇక తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే వైసిపి కట్టిన భవనాలను కూల్చివేయడానికి సిద్ధం అయ్యింది. అలాగే కొన్ని భవనాలను ఇప్పటికే కోల్చివేసింది.

ఇక ఇలా తెలుగు దేశం పార్టీ వైసిపి హయాంలో కట్టించిన భవనాలను కూల్చివేయడంపై కొంత మంది జనాలు వారు కట్టించిన భవనాలను కూల్చివేయడం ఎందుకు? వేరే ప్రభుత్వ పనులకు వాడవచ్చు కదా అనే అంశాన్ని వెల్లబుచ్చుతూ ఉంటే... మరి కొంత మంది మాత్రం అలా కూల్చివేయడమే కరెక్ట్.. లేకపోతే మళ్లీ వేరేవాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అనవసరంగా భవనాలను నిర్మిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తారు అనే వాదనను వినిపిస్తున్నారు. ఏదేమైనా కూడా అధికారంలోకి వచ్చి నెల కూడా కాకుండానే ఇలా భవనాల కూల్చివేతపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉండడంతో కొంత పాజిటివ్ గానూ.. కొంత నెగిటివ్ గానూ స్పందనలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: