మోహన్ బాబు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ.. కన్నప్పలో రజిని అందుకే నటించలేదట?

praveen
సినిమా ఇండస్ట్రీలో హీరోలు విలన్ పాత్రలు చేసే నటులు ఎంతోమంది ఉంటారు. కానీ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి విలక్షణమైన నటనతో ఆకట్టుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇక అలాంటి వారిలో మంచు మోహన్ బాబు ఒకరు అన్న విషయం తెలిసిందే. ఆయనను అందుకే డైలాగ్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు అభిమానులు. దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన.

 అయితే మంచు మోహన్ బాబు వారసులుగా విష్ణు మనోజ్ లు ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ ఇద్దరు ఇప్పటివరకు స్టార్ హీరోలుగా ఎదగలేకపోయారు. ఇంకా కెరియర్ను నిలబెట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మంచు మోహన్ బాబు పెద్ద తనయుడు విష్ణు హీరోగా ఎంతో భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా అది విపరీతంగా వైరల్ గా మారిపోతుంది.

 అయితే కన్నప్ప సినిమాలో దేశంలో ఉన్న టాప్ నటులందరినీ కూడా నటింప చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ మూవీ అందరిని సర్ప్రైజ్ చేయబోతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ మోహన్ బాబుకు ఎంతో దగ్గర మిత్రుడు అయిన రజనీకాంత్ ను మాత్రం ఈ సినిమాలోకి తీసుకోలేదు. ఎందుకు ఇలా మోహన్ బాబు చేశాడు అనే విషయంపై అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే మోహన్ బాబు ముందు ఒక కీలకమైన క్యారెక్టర్ ని ముందు రజినీకాంత్ తో చేయించాలని అనుకున్నాడట. కానీ రజనీకాంత్ దీనిని రిజెక్ట్ చేశాడట. ప్రస్తుతం ఆయనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక వైల్డ్ క్యారెక్టర్ ను పోషించలేను అని చెప్పడంతో.. ఇక ఆ పాత్రలో మోహన్ లాల్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. లేదంటే కన్నప్ప పాత్రలో రజనీకాంత్ ని కూడా నటింప చేయాలని అనుకున్నాడట మోహన్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: