రాయలసీమ: చిత్తూరులో వైసిపి పార్టీకి భారీ షాక్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో కూటమి పార్టీ భారీ ఘనవిజయాన్ని అందుకుంది. కేవలం వైసీపీ పార్టీ 11 స్థానాలకే పరిమితం అయింది. ఇక అప్పటినుంచి వైసిపి పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల అయ్యి ఇప్పటికి నెల రోజులు పైన కావస్తున్న కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా బయటపెట్టేలా చేస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేర్లను పెట్టడం అలాగే వైసిపి కార్యాలయాలను కూల్చివేయడంతో పాటు గతంలో తమను ఇబ్బంది పెట్టిన నేతలను కూడా ప్రత్యేకంగా చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు తాజాగా చిత్తూరులోని వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి చిత్తూరు మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి టిడిపి పార్టీకి చేరినట్లుగా తెలుస్తోంది. అలాగే మేయర్, డిప్యూటీ మేయర్స్ బాటలోనే పలువురు కార్పొరేటర్లు కూడా టిడిపి పార్టీలోకి చేరినట్లుగా సమాచారం. దీంతో చిత్తూరులో వైసీపీ పార్టీకి కాస్త గట్టి శాఖ తగిలినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సంఖ్యాబలా విషయానికి వస్తే వైసిపి 46.. టిడిపి పార్టీ-3 స్వతంత్ర అభ్యర్థి ఒకటి ఉండగా తాజా చేరికలతో ఈ లెక్కలు మారిపోయాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ రోజున చిత్తూరు మున్సిపాల్ కార్పొరేషన్ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ ఈ సమావేశానికి ముందే ఇలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అధికార పార్టీ ఏది ఉంటే వాటిలోకి జంపవ్వడం సర్వసాధారణమని కూడా చెప్పవచ్చు. పలు మున్సిపాలిటీలలో మేయర్లు కార్పొరేట్లు కూడా కొంతమంది అధికార టిడిపి పార్టీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఓటమి తర్వాత నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని ఏకిపారేయడం జరిగింది.. ఇలాంటి విధ్వంసాలను సృష్టిస్తే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని కూడా హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: