బర్రెలక్క అరెస్ట్.. జీపులోకి బలవంతంగా ఎక్కించిన పోలీసులు..??
సోషల్ మీడియా స్టార్, ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తాజాగా అరెస్టయింది. తెలంగాణ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జులై 5వ తేదీన నిరుద్యోగులకు మద్దతుగా టీజీఎస్‌పీఎస్‌సీ ఆఫీసు ముందు ఆమె ధర్నాకు దిగింది. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయవద్దు అంటూ ఆమె నినాదాలు చేసింది. పోలీసులు ఆమెను అడ్డుకుని అనంతరం అరెస్ట్ చేశారు. ఆపై బలవంతంగా జీపులో పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆమెతో పాటు అక్కడే ఉన్న ఆమె భర్తను కూడా అరెస్టు చేసి జీపులో ఎక్కించారు.
తెలంగాణ గవర్నమెంట్ సత్వరమే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని బర్రెలక్క డిమాండ్ చేసింది.
గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిని పాటించాలని చాలా కాలంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ విడుదల, జీవో 46 రద్దు చేయాలను కూడా డిమాండ్స్ వినిపిస్తున్నారు. వీటినే తీర్చాలని ఈరోజు టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయ ముట్టడి చేసి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పిలుపు మేరకు చాలామంది ఈ కార్యాలయాన్ని చుట్టుపెట్టారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఇటీవలే ప్రకటించింది. వారికి మద్దతుగా బర్రెలక్క నిలిచి చివరికి స్టేషన్ పాలు అయ్యింది.
పోలీసులు జీపులోకి ఎక్కించినప్పుడు "సీఎం రేవంత్ డౌన్!! డౌన్!! రాజీనామా చేయాలి! రౌడీ రాజ్యం నిరుద్యోగులు మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలి." అని ఆమె పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.
అయితే ఈ ధర్నా చేసేవారిని అదుపు చేసే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రొటెస్ట్ చేసే వారినే కాకుండా ఆ రోడ్డుమీదకు ఎవరొచ్చినా వాళ్లను లాకెళ్లి పోలీసు వాహనాలు ఎక్కిస్తున్నారు. దీనివల్ల సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక జంట కూడా అలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిని పంపించేశారు.