ఎట్టకేలకు డబుల్ ఇస్మార్ట్ నుండి పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చిన టీం..!?

Anilkumar
తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని డబుల్  ఇస్మార్ట్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్  ఇస్మార్ట్  అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. కాగా ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ రొమాన్స్ చేయబోతోంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ మూవీ లో కీలక పాత్రలో వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి

 భాషలలో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక ప్రమోషనల్ యాక్టివిటీతో సినీ లవర్స్ ని ఖుషి చేస్తుంది ఈ టీమ్ అంతా. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ "స్టెప్పమార్" ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు టీమ్.ఇక ఈ వీడియో నెట్టెంట తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది. కాగా ఈ విషయాన్ని తెలియజేసేందుకు..... హీరో హీరోయిన్లు అందరూ కలిసి డాన్స్ మూడ్ లో ఉన్న స్టిల్ ఫోటోను సోషల్

 మీడియాలో షేర్  చేశారు. తాజాగా ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎట్టకేరకు  సినిమా మొత్తాన్ని పూర్తిచేసి ఫైనల్ అప్డేట్ ఇచ్చి ప్రేక్షకులకు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశాడు రామ్ పోతినేని. కాగా ధిమాక్కిరికిరి డబుల్ ఇస్మార్ట్ అంటూ ఇప్పటికే లాంచ్ చేసిన టీచర్ ఈ సినిమాపై మరింత హై క్రియేట్ చేస్తోంది. దీంతో ప్రేక్షకులంతా ఈ సినిమాను  ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పూరి కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య సంగీతాన్ని  అందిస్తున్నారు. అంతేకాకుండా ఇస్మార్ట్ ఇస్ బ్యాక్... ఈసారి డబ్బులు ఇంపాక్ట్ అంటూ పూరి టీమ్ ఎంత ఇప్పటికే శక్తివంతమైన త్రిశూలంతో డిజైన్ చేసిన పోస్టర్ లో రామ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని భుజంపై గన్ పెట్టుకొని ధమ్ కి ఇస్తూ ప్రేక్షకులలో పూలకాలను తెప్పిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: