ఎన్బికె 109 : ఒకే రోజు రెండు అప్డేట్లు.. ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి రంగం సిద్ధం చేసిన మేకర్స్..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి దర్శకత్వంలో ఎన్ బీ కే 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా నుండి మూవీ బృందం వారు ఓ రెండు వీడియోలను విడుదల చేశారు. కానీ ఈ మూవీ టైటిల్ను అలాగే విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. దానితో ఈ సినిమాకు చిత్ర బృందం పలానా టైటిల్ను అనుకుంటున్నట్లు అనేక టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే ఈ మూవీ ని ఫలానా తేదీన విడుదల చేయబోతున్నారు అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలా అనేక రూమర్స్ ఈ సినిమా టైటిల్ పై , విడుదల తేదీ పై వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టైటిల్ మరియు విడుదల తేదీని విడుదల రీవిల్ చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమా టైటిల్ విడుదల కోసం ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అందులో ఈ మూవీ టైటిల్ ను విడుదల చేయనున్నట్లు , ఆ తర్వాత ఈ సినిమా యొక్క విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ విడుదలను మరియు ఈ మూవీ యొక్క విడుదల తేదీని ఒకే సారి అనౌన్స్ చేయబోతున్నట్లు అందుకు సంబంధించి ఓ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖండ , వీర సింహా రెడ్డి , భగవంత్ కేసీఆర్ లాంటి మూడు విజయాల తర్వాత బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , వాల్టేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: