పెద్ద రిస్క్ చేయనున్న విక్రమ్.. అదే జరిగితే తెలుగులో తంగాలం కి కలెక్షన్స్ కష్టమే..?

MADDIBOINA AJAY KUMAR
తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో విక్రమ్ ఒకరు. ఇకపోతే ఈయన గత కొంత కాలంగా వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయాడు. ప్రస్తుతం విక్రమ్ , పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తంగాలం అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రకరణ చాలా రోజులుగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరో రెండు , మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇకపోతే విక్రమ్ కి తమిళ్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈయన సినిమాలకు మంచి టాక్ వచ్చినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఆగస్టు 15 వ తేదీన ఇప్పటికే రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న డబల్ ఈస్మార్ట్ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక డబల్ ఈస్మార్ట్ మూవీ కి కనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే అదే తేదీన తంగాలం మూవీ విడుదల అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కే అవకాశం చాలా వరకు ఉండదు. మరి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్లు రాకపోయినా పర్లేదు అనే రిస్క్ తో తంగాలం మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేస్తారా లేక వేరే తేదీన విడుదల చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా కూడా తంగాలం మూవీ పై తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఒక వేళ భారీ బ్లాక్ బాస్టర్ వచ్చినట్లు అయితే తంగాలం మూవీ కి తెలుగులో కూడా డీసెంట్ కలెక్షన్లు లభించే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: